ఐఎస్‌ఎస్ లోకి ప్రవేశించిన సునీత బృందం
→
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోకి ప్రవేశించారు.
→
ఆమెతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్‌మోర్‌లు సైతం ప్రయాణించిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక విజయవంతంగా ఐఎస్‌ఎస్‌కు అనుసంధానమైంది.
→
సునీత, విల్‌మోర్‌లు.. ఐఎస్‌ఎస్‌లోని మిగతా వ్యోమగాములతో కలిసి కొన్ని పరీక్షలు, శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు.
→
బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్‌కు ఇది తొలి మానవసహిత యాత్ర.
→
అంతకుముందు హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్-కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి.
→
ఫలితంగా గంట ఆలస్యమైనప్పటికీ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కాగలిగింది. సునీతా విలియమ్స్‌కు ఇది మూడో రోదసి యాత్ర.
→
గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు.
→
322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్ కూడా చేశారు.
→
మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
→
→