వాట్సప్‌లో ఏఐ
→
ఇక నుంచి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే ఏ సెర్చ్ ఇంజిన్‌నూ ఆశ్రయించాల్సిన పనిలేదు.
→
వాట్సప్‌లో చాట్ చేస్తూనే వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని చిటికెలో తెలుసుకోవచ్చు.
→
అదే మెటా ఏఐ. వాట్సప్ మాతృ సంస్థ మెటా తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఇప్పుడిప్పుడే యూజర్లకు అందుబాటులోకి వస్తోంది.
→
ఆండ్రాయిడ్‌లో కుడివైపు కింద భాగంలో ఐఫోన్‌లో అయితే డిస్‌ప్లే పైభాగంలో కెమెరా ఐకాన్ పక్కన నీలంగా రింగు ఆకారంలో ఒక ఐచ్ఛికం కనిపిస్తోంది.
→
దాన్ని నొక్కి అనుమతి ఇస్తే.. మన చాటింగ్‌కు స్పందిస్తుంది. మనకి ఏం కావాలో చెబితే శోధించి తాజా సమాచారాన్ని మీ ముందు ఉంచుతుంది.
→
టెక్ట్స్ రూపంలో అడిగితే దానికి అనుగుణంగా ఏఐ ఫొటోలు, యానిమేషన్ క్లిప్పింగులనూ సృష్టిస్తుంది.
→
మీకు అందించే సమాచారం పూర్తిగా కావాలంటే ఎక్కడ లభిస్తుందో కూడా సూచిస్తుంది.
→
వ్యక్తిగత జీవితం, వారి గోప్యతను దెబ్బతీసే విషయాలు, ఆరోగ్యం తదితర అంశాలపై ఊహాజనిత ప్రశ్నలు అడిగితే మాత్రం వ్యక్తుల గోప్యతను గౌరవించడం ముఖ్యమని స్పష్టం చేస్తుంది.
→
ప్రస్తుతానికి ప్రధాని, రాష్ట్రపతి, సీఎం తదితరుల ఫొటోలూ ఇవ్వడం లేదు.
→
→