భారత్‌లో గూగుల్‌ జెమినీ యాప్‌


→ భారత్‌లో ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదార్ల కోసం కృత్రిమ మేధ (ఏఐ) అసిస్టెంట్‌ ‘జెమినీ’ని యాప్‌ రూపంలో తీసుకొచ్చినట్లు గూగుల్‌ ప్రకటించింది.
→ ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 8 భారతీయ భాషల్లో జెమినీ యాప్‌ లభించనుంది.
→ ఐఫోన్‌ వినియోగదారులు గూగుల్‌ యాప్‌ ద్వారా జెమినీ సేవలు వచ్చే కొన్ని వారాల్లో అందుబాటులోకి వస్తాయని జెమినీ ఎక్స్‌పీరియెన్సెస్‌ ఉపాధ్యక్షుడు (ఇంజినీరింగ్‌) అమర్‌ సుబ్రమణ్య తెలిపారు. గూగుల్‌ తీసుకొచ్చిన ఏఐ అసిస్టెంట్‌ జెమినీతో విద్యార్థుల నుంచి డెవలపర్ల వరకు తమ ఉత్పాదకత, నైపుణ్యాలు, సృజనాత్మకత పెంచుకోవచ్చని వెల్లడించారు.