చంద్రుడి శిలలపై పరిశోధించండి: చైనా అంతరిక్ష సంస్థ


→ చంద్రుడి నుంచి చాంగే-6 వ్యోమనౌక తీసుకొచ్చిన శిలలపై పరిశోధనకు ముందుకు రావాలని వివిధ దేశాల శాస్త్రవేత్తలను చైనా అంతరిక్ష సంస్థ ఆహ్వానించింది. కొన్ని షరతుల మేరకు వాటిపై పరిశోధనకు అవకాశమిస్తామని పేర్కొంది.
→ ముఖ్యంగా అమెరికా విషయంలో తమకు కొన్ని పరిమితులు ఉంటాయని తెలిపింది. చాంగే మిషన్‌ విజయాలపై బీజింగ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చైనా అంతరిక్ష శాస్త్రవేత్తలు మాట్లాడారు.
→ ‘నాసాతో చైనా శాస్త్రవేత్తలు ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోకుండా అమెరికా చట్టంలో నిబంధన ఉంది.
→ ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం ఉండాలంటే ముందు అలాంటి వాటిని తొలగించాలి’ అని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ వైస్‌ ఛైర్మన్‌ బియాన్‌ జిగాంగ్‌ స్పష్టం చేశారు.