అణు విద్యుత్‌లో సరికొత్త ఆవిష్కరణ


→ భారతీయ శాస్త్రవేత్తలు అణువిద్యుత్‌రంగంలో సరికొత్త సాంకేతికతతో ‘హైలెన్‌ఆర్‌’ పేరుతో అణు రియాక్టర్‌ను ఆవిష్కరించారు.
→ దీన్ని ఇళ్లలో వెలుగులకు, వంట అవసరాలు మొదలుకుని భారీమొత్తంలో సరఫరాకు, అంతరిక్ష అవసరాలకూ వినియోగించుకునే వీలుందని ఆవిష్కర్తలు చెబుతున్నారు.
→ దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్‌తీసుకున్నారు. భారత మిస్సైల్‌ప్రోగ్రాం మాజీ శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.ప్రహ్లాద రామారావు, సయ్యద్‌ముబషీర్‌అలీ, సిద్ధార్థ్‌దురైరాజన్, డా.శ్రీవరప్రసాద్‌లు ఈ ‘హైడ్రోజన్‌లో-ఎనర్జీ న్యూక్లియర్‌రియాక్టర్‌’(హైలెన్‌ఆర్‌)ను రూపొందించారు.
→ దీన్ని హైదరాబాద్‌లోని టీహబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీహబ్‌సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు, వ్యవస్థాపకులు ఆవిష్కరించారు.
→ హైడ్రోజన్‌కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా పలేడియం, ఉక్కు, నికెల్‌తో తయారుచేసిన ప్రత్యేక రియాక్టర్‌లో కొంతమేర విద్యుచ్ఛక్తిని పంపించి పీడనం ద్వారా హైడ్రోజన్‌పరమాణు కేంద్రక సంలీన(ఫ్యూజన్‌) ప్రక్రియ చేపడతారు.
→ ఈ ప్రక్రియలో భారీఎత్తున ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతుంది. దాన్ని విద్యుచ్ఛక్తిగా మార్చి.. వినియోగించుకోవచ్చు.