ఐఎస్‌ఎస్‌లో ఎమర్జెన్సీ!


→ భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది.
→ దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌లు తప్పనిసరిగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో తలదాచుకోవాల్సి వచ్చింది.
→ ఐఎస్‌ఎస్‌కు అత్యంత సమీపంలో భారీగా ఉపగ్రహ వ్యర్థాలు సంచరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
→ ఐఎస్‌ఎస్‌కు దగ్గరగా ఓ ఉపగ్రహం ముక్కలై శకలాలను విడుదల చేసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా గుర్తించింది.
→ వెంటనే ఈ విషయాన్ని వ్యోమగాములకు చేరవేసింది. దీంతో నిర్దేశిత ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సిబ్బంది మొత్తాన్ని వారికి సంబంధించిన వ్యోమనౌకల్లోకివెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
→ జూన్‌ 5 నుంచి అక్కడ ఉంటున్న సునీత, విల్‌మోర్‌లు స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో తలదాచుకొన్నారు.
→ దాదాపు గంటసేపు మిషన్‌ కంట్రోల్‌ అధికారులు ఇక్కడి వ్యర్థాలు ప్రయాణించే మార్గాన్ని సునిశితంగా పరిశీలించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
→ కొద్దిసేపటి తర్వాత ముప్పులేదని నిర్ధారించుకొని వ్యోమగాములకు క్లియరెన్స్‌ ఇచ్చారు.