విశ్వంలో సూపర్ గురూ
→ విశ్వంలో మరింత అద్భుతమైన, బరువైన సూపర్ గురు గ్రహాన్ని నాసాకు చెందిన వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది.
→ దీని వ్యాసం దాదాపుగా ఇప్పుడున్న గురు గ్రహమంత ఉన్నా బరువు 6 రెట్లు అధికమని తేలింది.
→ గురు గ్రహంలాగా ఇక్కడా హైడ్రోజన్ ఆధారిత వాతావరణం ఉంది.
→ ఈ సూపర్ గ్రహం సమీపంలో ఉన్న నక్షత్రం చుట్టూ తిరగడానికి 100 నుంచి 250 ఏళ్లు పడుతుందని భావిస్తున్నారు.
→ ఈ రెండింటి మధ్య ఉన్న దూరం సూర్యుడికి, భూమికి ఉన్న దూరం కంటే 15 రెట్లు ఎక్కువగా ఉంటుంది.
→ ఈ గ్రహం 3.5 బిలియన్ ఏళ్ల పాతదని, మన సోలార్ వ్యవస్థ కంటే బిలియన్ ఏళ్ల చిన్నదని జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ శాస్త్రవేత్త ఎలిజబెత్ మాథ్యూస్ తెలిపారు.
→ ఆయన గత ఏడాది సూపర్ గురు గ్రహం చిత్రాలను సేకరించారు. దీనిపై కథనం జర్నల్ నేచర్ పత్రికలో ప్రచురించారు.