సౌర తుపాన్‌ను క్లిక్‌మనిపించిన ఆదిత్య-ఎల్‌1




→ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌1 వ్యోమనౌకలోని రెండు రిమోట్‌ సెన్సింగ్‌ పరికరాలు ఇటీవల ఒక సౌర తుపాన్‌ను తమ కెమెరాల్లో బంధించాయి.
→ సోలార్‌ అల్ట్రా వయలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ (సూట్‌), విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనోగ్రాఫ్‌ (వీఈఎల్‌సీ)లు ఈ ఘనత సాధించాయి.
→ మే నెలలో సౌర తుపాన్ల కారణంగా వెలువడ్డ ఎక్స్, ఎం తరగతి జ్వాలలు ఇందులో కనిపించాయి.
→ ఏఆర్‌ 13664 అనే క్రియాశీల ప్రాంతంలో ఈ పరిణామం జరిగింది. దీనివల్ల భూఅయస్కాంత తుపాన్లు తలెత్తాయి.
→ ఆదిత్య ఎల్‌-1ను ఇస్రో గత ఏడాది సెప్టెంబరులో ప్రయోగించింది.
→ ఆ వ్యోమనౌక రోదసిలో 127 రోజులు ప్రయాణించి 2024 జనవరి 6న లగ్రాంజ్‌ పాయింట్‌-1 (ఎల్‌-1) అనే స్థానానికి చేరుకుంది.
→ అది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది.