చంద్రుడి మట్టి నమూనాల్లో నీటి ఆనవాళ్లు
→ చాంగే-5 మిషన్ ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి తీసుకొచ్చిన మట్టి నమూనాలను పరిశీలిస్తున్న చైనా శాస్త్రవేత్తలు వాటిలో నీటి అణువులను గుర్తించారు.
→ చాంగే-5 ద్వారా 2020లో చైనీయులు మట్టి, రాళ్లతో కూడిన నమూనాలను తీసుకొచ్చారు.
→ వీటిని సీఏఎస్‌తో పాటు మరో రెండు పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
→ 2009లో భారత్ ప్రయోగించిన చంద్రయాన్-1 వ్యోమనౌక కూడా చందమామపై ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులు కలిసి ఉన్న ఖనిజాలను గుర్తించింది.
→ 2020లో నాసా కూడా చంద్రుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించినట్లు ప్రకటించింది.