బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం


→ బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ రెండో దశను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది.
→ 5వేల కిలోమీటర్ల పరిధి ఉన్న క్షిపణులను సైతం విజయవంతంగా అడ్డుకోవడంలో దేశీయంగా రూపొందించిన ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.
→ ఈ పరీక్ష అన్ని అంశాల్లో లక్ష్యాలను చేరుకుందని రక్షణశాఖ వెల్లడించింది.
→ ఒడిశాలోని చాందీపుర్‌లో ఈ రక్షణ వ్యవస్థను పరీక్షించారు.
→ దీనిని విజయవంతం చేసిన డీఆర్‌డీవో అధికారులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు.
→ లక్షిత బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించారు. దీనిని భూమి, సముద్రంలో ప్రతిష్టించిన రాడార్‌ ఆయుధ వ్యవస్థ గుర్తించింది.
→ వెంటనే ఇంటర్‌సెప్టర్‌ యాక్టివేట్‌ అయింది. ఫేజ్‌-2 ఏడీ ఎండో-అట్మాస్ఫియరిక్‌ క్షిపణిని చాందీపుర్‌ నుంచి ప్రయోగించారు.
→ అది బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా అడ్డుకుంది. దేశీయంగా తయారైన ఈ వ్యవస్థ శత్రువులకు చెందిన అనేక క్షిపణులను అడ్డుకోగలుగుతుంది.