రాడార్‌కు అందని సాంకేతికత


→ రాడార్‌ సిగ్నళ్లకు అందకుండా ఉండటంతోపాటు రక్షణ వ్యవస్థల చుట్టూ మైక్రోవేవ్‌ కవచంలా పనిచేసే సాంకేతికతను భారతీయ నౌకా దళానికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అందజేసింది.
→ మధ్య శ్రేణి-మైక్రోవేవ్‌ అబ్‌స్క్యూరెంట్‌ చాఫ్‌ రాకెట్‌ (ఎంఆర్‌-ఎంవోసీఆర్‌) అనే ఈ వ్యవస్థను నౌకాదళ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ బ్రిజేశ్‌ వశిష్ఠకు డీఆర్‌డీవో ఛైర్మన్‌ సమీర్‌ వి కామత్‌ అందజేశారు.
→ దీనిని డీఆర్‌డీవో జోధ్‌పుర్‌ యూనిట్‌ రూపొందించింది. ఈ రాకెట్‌ను ఫైర్‌ చేసినప్పుడు రక్షణ వ్యవస్థల చుట్టూ మైక్రోవేవ్‌ మేఘాలు ఏర్పడి ముప్పుల నుంచి రక్షణగా నిలుస్తాయి.
→ ఎంఆర్‌-ఎంవోసీఆర్‌ తొలి దశను యుద్ధ నౌకల నుంచి విజయవంతంగా పరీక్షించారు.
→ రెండో దశలో రాడార్‌ క్రాస్‌ సెక్షన్‌ రిడక్షన్‌ ఆఫ్‌ ఏరియల్‌ లక్ష్యాలను 90శాతం సాధించారు.
→ ఈ వ్యవస్థను అభివృద్ధి చేసిన డీఆర్‌డీవోను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభినందించారు. ఆత్మ నిర్భరతలో మరో ముందడుగని అభివర్ణించారు.