భారతీయ రాకెట్‌ ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహం


→ ఇస్రో వాణిజ్య విభాగమైన ఎన్‌ఎస్‌ఐఎల్‌ తన కొత్త రాకెట్‌ ఎస్‌.ఎస్‌.ఎల్‌.వి.ద్వారా ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది.
→ స్పేస్‌ మెషీన్స్‌ కంపెనీ తయారుచేసిన ఆప్టిమస్‌ ఉపగ్రహాన్ని ఎన్‌ఎస్‌ఐఎల్‌.. కక్ష్యలోకి ప్రయోగిస్తుందని రెండు కంపెనీలు దిల్లీలో ప్రకటించాయి.
→ 450 కిలోల బరువైన ఆప్టిమస్‌.. ఆస్ట్రేలియా తయారుచేసిన అతి భారీ ఉపగ్రహం.
→ 10 కిలోల బరువైన జానస్‌ ఉపగ్రహాన్ని ఎస్‌.ఎస్‌.ఎల్‌.వి. ఇంతకుముందు ప్రయోగించిందని ఎన్‌ఎస్‌ఐఎల్‌ చైర్మన్‌ రాధాకృష్ణన్‌ దురైరాజ్‌ తెలిపారు.