గాలిలో పేలిన ఉత్తర కొరియా క్షిపణి




→ ఉత్తర కొరియా ప్రయోగించిన హైపర్‌ సోనిక్‌ క్షిపణి గాలిలో పేలిపోయింది.
→ ప్రయోగించిన ప్రాంతం నుంచి దాదాపు 250 కిలోమీటర్ల వరకూ దాని శకలాలు పడిపోయాయని దక్షిణ కొరియా సైనికాధికారి వెల్లడించారు.
→ ‘క్షిపణిని ఈశాన్య జలాల్లోకి ఉత్తర కొరియా ప్రయోగించింది. గాలిలోకి లేచిన తర్వాత అది పేలిపోయింది. దీనివల్ల ఎటువంటి నష్టం జరగలేదు’ అని వివరించారు.
→ దక్షిణ కొరియా, జపాన్‌లతో కలిసి అమెరికా ప్రాంతీయంగా బలగాలను మోహరించిన నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించడం గమనార్హం.
→ అది భారీగా పొగను వెదజల్లిందని, ఇంజిన్‌లో లోపం కారణంగా ఇలా జరిగి ఉండవచ్చని అధికారులు తెలిపారు.
→ ఈ ప్రయోగాన్ని అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ సంయుక్తంగా ఖండించాయి.
→ మరోవైపు ఉత్తర కొరియాతో సరిహద్దు ఉన్న సముద్ర ప్రాంతంలో దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను నిర్వహించింది.