స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ ప్రయోగం విజయవంతం!
→
స్పేస్‌ఎక్స్ సంస్థకు చెందిన స్టార్‌షిప్ మెగా రాకెట్ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది.
→
మునుపటిలా విస్ఫోటం చెందకుండా అది క్షేమంగా భూమికి తిరిగొచ్చింది.
→
మానవులను అంగారకుడు, చందమామపైకి తీసుకెళ్లేందుకు స్పేస్‌ఎక్స్ సంస్థ దీన్ని రూపొందించింది.
→
ఈ భారీ రాకెట్‌లో రెండు అంచెలు ఉన్నాయి. ఇందులో ‘సూపర్ హెవీ’ రాకెట్ బూస్టర్, దానికి ఎగువన స్టార్‌షిప్ వ్యోమనౌక ఉన్నాయి.
→
ఇది దక్షిణ టెక్సాస్‌లోని బోకా చికా గ్రామంలో ఉన్న ప్రయోగ వేదిక నుంచి నింగికెగిసింది.
→
74 కిలోమీటర్ల ఎత్తులో ఎగువ దశ నుంచి సూపర్ హెవీ బూస్టర్ విడిపోయింది.
→
అనంతరం అది వేగాన్ని నియంత్రించుకుంటూ సాఫీగా గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సముద్ర జలాల్లో పడింది.
→
మరోవైపు స్టార్‌షిప్ తన సొంత ఇంజిన్ల సాయంతో నింగిలోకి దూసుకెళ్లింది. 200 కిలోమీటర్ల ఎత్తు వరకూ వెళ్లి, హిందూ మహాసముద్రం వైపు మళ్లింది.
→
అనంతరం భూవాతావరణంలోకి తిరిగొచ్చింది.
→
→