విఫలమైన స్పేస్‌ఎక్స్ రాకెట్!
→ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ గత దశాబ్ద కాలంలో తొలిసారిగా విఫలమైంది.
→ దీంతో ఆ రాకెట్ ద్వారా ప్రయోగించిన 20 స్టార్‌లింక్ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకోలేకపోయాయి.
→ ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన ఆ శాటిలైట్లు తక్కువ ఎత్తులోనే ఉండిపోయాయి.
→ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే దాని ఎగువ దశ ఇంజిన్ నుంచి ద్రవ ఆక్సిజన్ లీక్ కావడం వల్ల ఇలా జరిగిందని స్పేస్‌ఎక్స్ వెల్లడించింది.
→ ‘‘ఫాల్కన్-9 రాకెట్ ఇంజిన్‌లో లోపాన్ని గుర్తించిన వెంటనే మా ఇంజినీర్లు.. దానిలోని దాదాపు సగం ఉపగ్రహాలతో సంధానమయ్యారు.
→ వాటిలోని అయాన్ ఇంజిన్లను మండించి శాటిలైట్లను ఎగువ కక్ష్యలోకి పంపేందుకు యత్నించినా సాధ్యపడలేదు’’ అని తెలిపింది.
→ తక్కువ ఎత్తులోనే ఉండిపోయిన ఉపగ్రహాలు గాల్లోనే కాలిపోతాయని పేర్కొంది.