తొలి పరిభ్రమణాన్ని పూర్తిచేసుకున్న ఆదిత్య-ఎల్1
→ సూర్యుడిపై పరిశోధనలకు భారత్ ప్రయోగించిన తొలి వ్యోమనౌక ఆదిత్య-ఎల్1 విజయవంతంగా ఒక పరిభ్రమణను పూర్తిచేసుకుంది.
→ సూర్యుడు-భూమి వ్యవస్థలోని ఎల్1 బిందువు చుట్టూ ఈ ప్రదక్షిణ చేసింది.
→ ఆదిత్య-ఎల్1ను గత ఏడాది సెప్టెంబరు 2న ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 6న అది ఎల్1 కక్ష్యలోకి ప్రవేశించింది.
→ అక్కడ ఒక పరిభ్రమణం పూర్తికావడానికి 178 రోజులు పడుతుంది. ఈ కక్ష్యలో తిరిగేటప్పుడు రోదసిలోని వివిధ రకాల బలాలు వ్యోమనౌకపై పనిచేస్తాయి.
→ ఫలితంగా దాని లక్షిత ప్రయాణ మార్గంలో వైరుధ్యాలు తలెత్తుతుంటాయి.
→ ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరి 22న, జూన్ 7న ఆదిత్య-ఎల్1 గమనంలో అవసరమైన సర్దుబాట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చేయాల్సి వచ్చింది.