Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home


చందమామపై పనిచేస్తున్న జపాన్‌ ల్యాండర్‌




జాబిల్లిపైకి జపాన్‌ ప్రయోగించిన ‘స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌ (స్లిమ్‌)’ వ్యోమనౌక తాజాగా పనిచేయడం మొదలుపెట్టింది.
→ దీంతో ఈ ల్యాండర్‌ భవితపై ఏర్పడ్డ ఉత్కంఠకు తెరపడింది. జనవరి 20న స్లిమ్‌.. చంద్రుడి ఉపరితలంపై దిగింది.
→ దీంతో అమెరికా, సోవియట్, చైనా, భారత్‌ తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో దేశంగా జపాన్‌ నిలిచింది.
→ అయితే స్లిమ్‌.. చంద్రుడిపై తలకిందులుగా ల్యాండ్‌ అయింది. దీంతో సౌరఫలకాలను కాంతి తాకలేదు.
→ ఫలితంగా విద్యుదుత్పత్తి సాధ్యంకాలేదు. అప్పటికే ఉన్న బ్యాటరీ శక్తితో కొన్ని గంటలు పనిచేసింది.
→ ‘చందమామ ఆకాశం’లో సూర్యుడు మరింత ఎత్తుకు చేరేవరకూ శాస్త్రవేత్తలు ఈ వ్యోమనౌకను ‘స్విచ్ఛాఫ్‌’ చేశారు.
→ ఇప్పుడు సూర్యకిరణాల దిశ మారి సౌరఫలకాలపై కాంతి ప డుతుండటంతో దానిని క్రియాశీలం చేశారు.
→ జనవరి 28న ల్యాండర్‌తో సంబంధాలను పునరుద్ధరించినట్లు జపాన్‌ ఏరోస్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఏజెన్సీ (జాక్సా) ప్రకటించింది.
→ విద్యుత్‌ అందుబాటులోకి రావడంతో స్లిమ్‌.. సమీపంలోని రాళ్లపై పరిశోధనలు మొదలుపెట్టింది.
→ మల్టీబ్రాండ్‌ స్పెక్ట్రల్‌ కెమెరాతో విశ్లేషణ చేపట్టింది. తద్వారా చంద్రుడి ఆవిర్భావం గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నించింది.
→ సమీపంలోని రాయిని ఫొటో తీసి పంపింది. దానికి ‘టాయ్‌ పూడల్‌’ అని పేరు పెట్టారు.
→ చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అత్యంత కష్టం. దీనికోసం చేసిన సగం ప్రయత్నాలు విఫలమయ్యాయి.
→ వాస్తవానికి స్లిమ్‌ ప్రయోగంలో అత్యంత కచ్చితత్వంతో ల్యాండింగ్‌ చేయడంపై జాక్సా దృష్టిపెట్టింది.
→ ఇందుకు చందమామపై కేవలం 100 మీటర్ల వెడల్పున్న ప్రదేశాన్ని ఎంచుకొంది.
→ గతంలో జాబిల్లిపై దిగిన ల్యాండర్లు 10 కిలోమీటర్ల వెడల్పున్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకునేవి.
→ చివరి నిమిషంలో ఇంజిన్‌ వైఫల్యం కారణంగా స్లిమ్‌ వ్యోమనౌక అంత సాఫీగా చంద్రుడిపై దిగలేదు.
→ లక్షిత ప్రదేశానికి 55 మీటర్ల దూరంలో, రెండు బిలాల మధ్య ఉన్న ప్రదేశంలో ల్యాండ్‌ అయింది.
→ ఈనెల మొదట్లో అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ కూడా లూనార్‌ మిషన్‌ చేపట్టగా అది పసిఫిక్‌ సముద్రంలో కూలిపోయి విఫలమైంది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి