ఎలన్ మస్క్ ప్రారంభించిన ‘న్యూరాలింక్’ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడిందని, బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ సాంకేతికత(బీసీఏ)ను మానవులపై తొలిసారి ప్రయోగించినట్లు ప్రకటించారు.
→
ఓ వ్యక్తి మెదడులో చిప్‌ను అమర్చామని, ప్రారంభ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని వెల్లడించారు
→
ఎలా ప్రారంభమైందంటే:-
→
న్యూరాలింక్‌ను ఎలాన్ మస్క్ 2016లో ప్రారంభించారు. దీని గురించి అందరికీ తెలిసింది మాత్రం 2017లోనే.
→
కృత్రిమ మేధ మానవుల మేధస్సును భవిష్యత్తులో మించిపోనుందని, అది మానవాళిపై ఆధిపత్యం చెలాయించనుందన్నది మస్క్ వాదన.
→
దాన్ని ఎదుర్కొవడానికే తాను న్యూరాలింక్ ప్రాజెక్టు ప్రారంభించానని పలు సందర్భాల్లో మస్క్ తెలిపారు.
→
ఈ ప్రాజెక్టు ఉద్దేశమేంటంటే:-
→
మన మెదడు శరీరంలోని వివిధ అవయవాలకు నాడీ కణాల ద్వారా సంకేతాలను పంపడం..అందుకోవడం చేస్తుంది.
→
ఈ కణాలు పరస్పరం అనుసంధానమై ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తాయి.
→
న్యూరో ట్రాన్స్‌మిటర్లు అనే రసాయన సంకేతాలతో ఇవి కమ్యూనికేషన్‌ను కొనసాగిస్తాయి. ఈ ప్రక్రియలో విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది.
→
మెదడులోని పలు న్యూరాన్లకు దగ్గరగా ఎలక్ట్రోడులను ఉంచడం ద్వారా వాటిలోని విద్యుత్ సంకేతాలను రికార్డు చేయడం న్యూరాలింక్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
→
సూటిగా చెప్పాలంటే మెదడులోని ఆలోచనాశక్తి సాయంతో మనం యంత్రాలకు అనుసంధానం కావొచ్చు. వాటిని నియంత్రించవచ్చు.
→
నాడీ, కండరాల కదలికలకు సంబంధించిన వ్యాధులకూ చికిత్స చేయవచ్చు. తొలుత పందులు, కోతులపై ప్రయోగాలు చేశారు.
→
ఓ కోతికి మెదడులో చిప్ అమర్చి.. దాంతో ఓ వీడియోగేమ్‌ను విజయవంతంగా ఆడించారు.
→
జాయ్‌స్టిక్ లాంటి పరికరం లేకుండానే ఆ వానరం తన ఆలోచనలతో ఆ ఆటను నియంత్రించింది.
→
ఆ తర్వాత మనుషులపై ప్రయోగాలకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నుంచి గతేడాది మేలో మస్క్ అనుమతి సాధించారు.
→
మెదడులో అమర్చేదిలా:-
→
సర్జరీతో మెదడులో చిన్న రంధ్రం చేస్తారు. అందులో 8 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న ఎన్1 చిప్‌ను అమరుస్తారు.
→
సన్నని వైర్లను నేరుగా మెదడులోకి ప్రవేశపెడతారు. చిప్‌ను సురక్షితంగా కచ్చితత్వంతో అమర్చేందుకు న్యూరాలింక్ ఓ రోబోను తయారు చేసింది.
→
దాని సాయంతోనే ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. చిప్‌లో బ్యాటరీ వైర్‌లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతుంది.
→
చిప్ అమర్చాలంటే బ్రెయిన్ సర్జరీ చేయాలి. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. ఆరోగ్యపరంగానూ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.
→
మెదడులో రక్తం గడ్డ కట్టే పరిస్థితులూ ఎదురుకావొచ్చు. అంతేకాదు.. ఈ పరికరం ఎంత మేరకు సురక్షితమన్న విషయంపై ఇంకా డేటా వెల్లడి కాలేదు.
→
బ్రెయిన్‌లో న్యూరాన్స్ శరీరంలోని నాడులకు, కండరాలకు ఇతర అవయవాలకు సంకేతాలను ప్రసారం చేస్తాయి.
→
చిప్‌లో ఎలక్ట్రోడ్స్ ఈ సంకేతాలను అర్థం చేసుకొని మోటార్ కంట్రోల్స్ రూపంలోకి అనువదిస్తాయి.
→
దీంతో కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లతో పాటు.. కండరాలు, నాడులు..తదితర శరీర అవయవాల కదలికలను కూడా నియంత్రించవచ్చు.
→
ముఖ్యంగా పక్షవాతం బారిన పడిన వారు తమ మెదడు ద్వారా సంకేతాలను పంపొచ్చు.
→
ఈ సంకేతాలను కంప్యూటర్ లేదా మొబైల్‌లో న్యూరాలింక్ యాప్ గ్రహించి వాటిని అక్షర రూపంలో మార్చే అవకాశం ఉంది.
→
ఎలక్ట్రోడ్లు:-
→
మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సంకేతాలను గుర్తించి ఎన్1 చిప్‌నకు పంపుతాయి. చిప్‌లో ఎలక్ట్రోడ్లు ఉంటాయి.
→
ఇవి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. ఒక వ్యక్తిలో 10 వరకు చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు.
→
ఈ చిప్‌ను అమర్చిన తర్వాత మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను అందుకోవడం.. పంపడం.. ప్రేరేపించడం వంటివి చేస్తుంది.
→