Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home


చౌకైన సెమీకండక్టర్ల తయారీకి సరికొత్త విధానం




తక్కువ ఖర్చుతో సమర్థమైన సెమీకండక్టింగ్‌ పదార్థం అభివృద్ధికి ఒక కొత్త విధానాన్ని భారత్, ఆస్ట్రియా శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు.
→ ఎలక్ట్రిక్‌ వాహనాలు, హై వోల్టేజ్‌ ట్రాన్స్‌మిషన్‌ వంటి రంగాల్లో పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ సమర్థతను ఇది గణనీయంగా పెంచుతుంది.
→ హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ ఐఐటీ, ఆస్ట్రియాలోని వియన్నా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు.
→ అల్ట్రావైడ్‌ బ్యాండ్‌ గ్యాప్‌ సెమీ కండక్టర్‌ (యూడబ్ల్యూబీజీఎస్‌) అయిన గాలియం ఆక్సైడ్‌ను చౌకలో అభివృద్ధి చేశారు.
→ ఇందుకోసం ప్రత్యేక ‘లో ప్రెజర్‌ కెమికల్‌ వేపర్‌ డిపాజిషన్‌’ వ్యవస్థను వాడారు.
→ ఈ తరహా పదార్థాలు అధిక పనితీరు కనబరిచే సాధనాల సాకారానికి వీలు కల్పిస్తాయి.
→ పవర్‌ ఎలక్ట్రానిక్‌ వ్యవస్థకు పవర్‌ సెమీ కండక్టర్‌ సాధనాలే కీలకం. పునరుత్పాదక వనరులు, థర్మల్‌ విద్యుత్‌ ప్రవాహాన్ని ఇవే నియంత్రిస్తాయి.
→ వినియోగ అవసరాలకు తగ్గట్లు వోల్టేజీ, ఫ్రీక్వెన్సీని నిర్వహిస్తాయి.
→ సాధారణంగా పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ గుండా పయనించేటప్పుడు విద్యుత్‌ నష్టాలు వాటిల్లుతాయి.
→ ఈ నేపథ్యంలో గాలియం నైట్రైడ్, సిలికాన్‌ కార్బైడ్‌ వంటి పదార్థాల సాయంతో పవర్‌ ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ సమర్థతను పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
→ అయితే ధర, ఇతర ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఈ పదార్థాలను సన్నటి ఫలకాలను తయారుచేయడం ప్రధాన సవాల్‌గా మారింది.
→ విస్తృత అధ్యయనాల తర్వాత భారత్, ఆస్ట్రియా శాస్త్రవేత్తలు ఈ ఇబ్బందిని అధిగమించారు.
→ అత్యంత నాణ్యమైన యూడబ్ల్యూబీజీఎస్‌ సెమీ కండక్టర్లను అభివృద్ధి చేశారు.
→ దీనివల్ల హైపవర్‌ సాధనాలు 200 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా సమర్థంగా పనిచేయగలుగుతాయి.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి