Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home


‘మొండి క్షయ’పై ఏఐ ప్రయోగం




వైద్యులు సూచించినట్లు నిర్ణీత కాలం క్రమంతప్పకుండా ఔషధాలు తీసుకొంటేగానీ క్షయ వ్యాధి నయం కాదు.
→ అందుబాటులో లేకగానీ, నిర్లక్ష్యం వల్లగానీ మధ్యలోనే తీసుకోవడం మానేస్తే ఆ ఔషధాలు ప్రభావరహితంగా మారుతాయి.
→ పైగా క్షయ ముదిరి మందులకు లొంగకుండా పోతుంది. భారత్‌తోపాటు అనేక వర్ధమాన దేశాల్లో ఈ సమస్య చాలా అధికం.
→ ఇలాంటి మొండి క్షయ కేసుల్లో రకరకాల మందులను కలిపి వాడతారు.
→ ఆ మిశ్రమాలు అందరికీ ఒకేరకంగా పనిచేయకపోవచ్చు, మొండి క్షయ కేసుల్లో ఎవరెవరికి ఏయే మందులు వాడాలో తెలుసుకోవడానికి కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగపడుతుందని అమెరికాలోని మిషిగన్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం తేల్చింది.
→ ఈ సంస్థకు చెందిన భారతీయ పరిశోధకులు శ్రీరాం చంద్రశేఖరన్, అవంతి సంబారేలు వివిధ దేశాలకు చెందిన 5,000 మంది మొండి క్షయ రోగులను అధ్యయనం చేశారు.
→ వారి వయసు, లింగం, పూర్వ చికిత్స చరిత్ర, హెచ్‌ఐవీ వంటి ఇతర వ్యాధుల సమాచారం, ఎక్స్‌రేలు, సీటీ స్కాన్లు, వారికి ఏయే క్షయ మందులు పనిచేయడం లేదనే అంశాలను దాదాపు 200 వరకు పరిగణనలోకి తీసుకున్నారు.
→ ఇంతటి విస్తృత సమాచారాన్ని విశ్లేషించడం కష్టం కాబట్టి ఆ పనిని ఏఐకి అప్పగించారు.
→ క్షయకారక బ్యాక్టీరియాలో వచ్చిన జన్యు మార్పులను పసిగట్టారు.
→ మొండి క్షయపై ఏయే మందులు పనిచేస్తాయో సిఫార్సు చేసే సత్తా ఏఐకి ఉందని పరిశోధకులు తెలిపారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి