→
గర్భధారణ, ప్రసవం, ప్రసవానంతర సమయాల్లో న్యుమోనియాగానీ, గర్భాశయ వ్యాధిగానీ వస్తే అది సెప్సిస్‌కు దారితీస్తుంది.
→
సెప్సిస్ వల్ల కణజాల నష్టం, అవయవ వైఫల్యం సంభవిస్తుంది.కొన్ని కేసుల్లో మరణమూ తప్పదు! పేద దేశాల్లో గర్భిణులకు సెప్సిస్ ముప్పు అధికం.
→
ప్రపంచవ్యాప్తంగా తల్లుల మరణానికి దారితీస్తున్న మూడు ప్రధాన వ్యాధుల్లో సెప్సిస్ ఒకటి. పురిటినొప్పుల సమయంలో ఒకే ఒక అజిత్రోమైసిన్ మాత్ర ఇస్తే సెప్సిస్ ప్రమాదాన్ని నివారించవచ్చని అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్ధారించారు.
→
వారు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా పలు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో అధ్యయనం జరిపారు.
→
అజిత్రోమైసిన్ చాలా చవకగా లభించే యాంటీబయాటిక్. దీన్ని ప్రసవ సమయంలో తల్లులందరికీ ఇవ్వడం చాలా అనువైన పరిష్కారం.
→