Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home


ఉక్రెయిన్‌పై తొలిసారి జిర్కాన్‌ క్షిపణిని ప్రయోగించిన రష్యా





→ రష్యా తన అమ్ములపొదిలోని అత్యాధునిక అస్త్రాన్ని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది.
→ ఈ విషయాన్ని మాస్కో బహిర్గతం చేయకపోయినా కీవ్‌ ఫోరెన్సిక్‌ పరిశోధనా సంస్థ బృందం గుర్తించింది.
→ కీవ్‌పై జరిగిన ఒక దాడిలో జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణిని వాడినట్లు ఆ బృందం వెల్లడించింది.
→ ఒక్కసారి జిర్కాన్‌ క్షిపణి గాల్లోకి ఎగరడం మొదలుపెడితే దానిని ప్రపంచంలోని ఏ అత్యున్నత గగనతల రక్షణ వ్యవస్థా అడ్డుకోలేదు.
→ అమెరికాకు చెందిన మిసైల్‌ డిఫెన్స్‌ అడ్వకసి అలయన్స్‌ అంచనా ప్రకారం.. ఈ క్షిపణి గంటకు 9,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
→ ‘ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణి జిర్కాన్‌. దానిని అడ్డుకోవడం అసాధ్యం. ఈ క్షిపణి ప్రయాణించే సమయంలో వేగానికి చుట్టూ ప్లాస్మా మేఘంతో వలయం ఏర్పడుతుంది. గగనతల రక్షణ వ్యవస్థల నుంచి వచ్చే రాడార్‌ సంకేతాలను అది తనలో కలిపేసుకొని ప్రతిఫలించనివ్వదు. దీంతో ఈ క్షిపణిని గుర్తించలేం’ అని ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి