Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home


చంద్రుడి పుట్టుక గుట్టు విప్పనున్న జపాన్‌ వ్యోమనౌక స్లిమ్





→ అక్కడ పది శిలలను విశ్లేషించిందని, తాము ఊహించినదాని కన్నా కీలక డేటాను పంపిందని చెప్పారు.
→ వాటి సాయంతో చంద్రుడి ఆవిర్భావానికి సంబంధించిన కీలక వివరాలను పొందొచ్చని జపాన్‌ అంతరిక్ష సంస్థ తెలిపింది.
→ స్లిమ్‌ వ్యోమనౌక గత నెల 20న చంద్రుడిపై దిగిన సంగతి తెలిసిందే.
→ అది తలకిందులుగా ల్యాండ్‌ కావడంతో తొలుత దాని సౌరఫలకాలు సూర్యుడి నుంచి కాంతిని పొందలేకపోయాయి. అయితే, 8వ రోజు నుంచి అది పనిచేయడం ప్రారంభించింది.
→ గత కొద్దిరోజులుగా ఈ వ్యోమనౌక తన మల్టీ బ్యాండ్‌ స్పెక్ట్రల్‌ కెమెరా సాయంతో జాబిల్లి శిలల్లోని మూలకాలను శోధించింది.
→ ఒక రాతి ముక్కను అది విశ్లేషిస్తుందని తొలుత భావించారు. కానీ, ఏకంగా 10 శిలలను అది శోధించింది. దీంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వ్యక్తమైంది.
→ ‘‘చంద్రుడి శిలల్లోని మూలకాలను.. భూమి మీదున్న శిలల్లోని మూలకాలను పోల్చి చూడటం ద్వారా కీలక విషయాలను తెలుసుకోవచ్చు. రెండు చోట్లా ఒకే రకం మూలకాలు ఉన్నాయా అన్నది తేల్చవచ్చు’’ అని పరిశోధకులు తెలిపారు.
→ ప్రస్తుతం చంద్రుడి పుట్టుకకు సంబంధించి ‘జయంట్‌-ఇంపాక్ట్‌ సిద్ధాంతం’ వ్యాప్తిలో ఉంది.
→ దీని ప్రకారం.. ఒక భారీ గ్రహం భూమిని ఢీ కొట్టడం వల్ల విడిపోయిన కొంత భాగం.. చందమామగా రూపాంతరం చెంది ఉంటుంది.
→ ఈ సిద్ధాంత వాస్తవికతను ‘స్లిమ్‌’ నిగ్గు తేల్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి