చంద్రుడిపైకి ప్రైవేటు ల్యాండర్
→ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా సహకారంతో ‘ఇన్‌ట్యూటివ్ మెషీన్స్’ అనే ప్రైవేటు కంపెనీ చంద్రుడిపైకి ల్యాండర్‌ను ప్రయోగించింది.→ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ రాకెట్ ఈ ల్యాండర్‌ను తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది.
→ అన్నీ అనుకున్నట్లు జరిగితే ల్యాండర్ ఫిబ్రవరి 22న జాబల్లిపై దిగనుంది. దాని పొడవు 14 అడుగులు.
→ చంద్రుడి దక్షిణ ధ్రువానికి 300 కి.మీ. దూరంలో దాన్ని ల్యాండ్ చేయాలని భావిస్తున్నట్లు ఇన్‌ట్యూటివ్ మెషీన్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ స్టీవ్ ఆల్టెమస్ వెల్లడించారు.
→ అది వారం రోజుల పాటు పరిశోధనలు చేసి నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతుందని పేర్కొన్నారు.
→ అమెరికాకు చెందిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ కంపెనీ గత నెలలో పెరిగ్రీన్ అనే ల్యాండర్‌ను చంద్రుడిపైకి ప్రయోగించింది.
→ అయితే ఇంధన లీకేజీ కారణంగా తొలి దశల్లోనే ఆ ప్రయోగం విఫలమైంది.
→