విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్
→ విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని నడిభాగంలో ఒక భారీ కృష్ణబిలం ఉంది. అది చాలా వేగంగా ఎదుగుతోంది.→ ఇది నిత్యం సూర్యుడంత పరిమాణంలోని పదార్థాన్ని స్వాహా చేస్తున్నట్లు వెల్లడైంది. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు.
→ ఈ క్వాసార్.. రికార్డు స్థాయిలో మన సూర్యుడి కన్నా 500 లక్షల కోట్ల రెట్లు ఎక్కువ వెలుగులీనుతోంది.
→ దీనికి ఆయువులూదుతున్న కృష్ణబిలం.. భానుడి కన్నా 17 వందల కోట్ల రెట్లు పెద్దగా ఉంది.
→ ఈ కృష్ణబిలం చుట్టూ చేరుతున్న వాయువులు సుడులు తిరుగుతూ అంతరిక్ష తుపానును తలపిస్తున్నాయి.
→ ఇది విశ్వంలోనే అత్యంత విస్ఫోటకర ప్రదేశమని పరిశోధనకు నాయకత్వం వహించిన క్రిస్టియన్ వుల్ప్ తెలిపారు.
→ నిజానికి ఈ క్వాసార్‌ను 1980 నాటి ‘స్కై సర్వే’లో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ గుర్తించింది.
→ అయితే దాన్ని అప్పట్లో ఓ నక్షత్రంగా భావించారు. అది క్వాసార్ అని ఆస్ట్రేలియా, చిలీలోని టెలిస్కోపులతో పరిశీలించినప్పుడు తాజాగా వెల్లడైంది.
→ అది మనకు 12 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. విశ్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇది కూడా జనించి ఉంటుందని భావిస్తున్నారు.
→ నక్షత్ర మండలంలో అత్యంత క్రియాశీల, దేదీప్యమాన కేంద్ర భాగాలను క్వాసార్లుగా పేర్కొంటారు.
→