‘తేజస్’లో స్వదేశీ డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్
→ స్వదేశీ తేజస్ యుద్ధ విమాన ప్రాజెక్టులో మరో మైలురాయిని సాధించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.→ అందులో దేశీయ టెక్నాలజీతో రూపొందిన ‘డిజిటల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్’ (డీఎఫ్‌సీసీ)ను అనుసంధానించినట్లు వెల్లడించింది.
→ దాన్ని ఫిబ్రవరి 19న విజయవంతంగా గగనవిహారం చేయించినట్లు వివరించింది.
→ తేజస్-మార్క్1ఏ వెర్షన్‌ను సాకారం చేసే దిశగా ఇదో ముందడుగని తెలిపింది.
→ డీఎఫ్‌సీసీని బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఈ) అభివృద్ధి చేసింది.
→ భారత వాయుసేన వద్ద ఇప్పటికే తేజస్-మార్క్1 వెర్షన్ యుద్ధవిమానాలు ఉన్నాయి.
→ మార్క్-1ఏ రూపంలో మరింత మెరుగైన లోహ విహంగం సిద్ధమవుతోంది.
→ ఇందులో అడ్వాన్స్డ్ మిషన్ కంప్యూటర్, హై పెర్ఫార్మెన్స్ డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్, స్మార్ట్ మల్టీ ఫంక్షన్ డిస్ప్లేలు, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే (ఏఈఎస్‌ఏ) రాడార్, అధునాతన స్వీయ రక్షణ జామర్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు ఉంటాయి.
→ 83 తేజస్-మార్క్1ఏ కొనుగోలుకు హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌తో రూ.48వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది.
→