డెంగీకి మరో టీకా!
→డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది.→ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది.
→ఈ ఏడాది ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో డెంగీ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
→జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ తకెడా ఈ టీకాను అభివృద్ధి చేసింది. దీని పేరు క్యూడెంగా.
→ఆరు నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు దీన్ని ఇవ్వవచ్చని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
→వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ టీకాలను అందివ్వాలని కోరింది. ఇందులో రెండు డోసులు ఉంటాయి.
→ఇది నాలుగు రకాల డెంగీల నుంచి రక్షణ కల్పిస్తుంది. 2022లో దీనికి ఐరోపా ఔషధ సంస్థ నుంచి ఆమోదం లభించింది.
→ తాజాగా డబ్ల్యూహెచ్‌వో కూడా పచ్చజెండా ఊపడం వల్ల వివిధ దాతృత్వ సంస్థలు, ఐరాస అనుబంధ విభాగాలు ఈ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి, పేద దేశాలకు పంపిణీ చేయడానికి వీలవుతుంది.