Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






చంద్రుడిపై తొలి వాణిజ్య వ్యోమనౌక

→ అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీ ‘ఇంట్యూటివ్‌ మెషీన్స్‌’ అంతరిక్ష రంగంలో చరిత్ర సృషించింది.
→ చంద్రుడిపై తొలి వాణిజ్య వ్యోమనౌకను విజయవంతంగా దించింది.
→ 1972లో అపోలో-17 యాత్ర తర్వాత అమెరికా ల్యాండర్‌ ఒకటి జాబిల్లిపై దిగడం ఇదే మొదటిసారి.
→ దీంతో చంద్రుడిపై వాణిజ్య పరిశోధనల శకానికి తెరలేచినట్లయింది. ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ రూపొందించిన ఒడిస్సియస్‌ అనే వ్యోమనౌక.
→ జాబిల్లికి చేరువయ్యే క్రమంలో కొద్దిసేపు వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయాయి.
→ కమ్యూనికేషన్ల పునరుద్ధరణ తర్వాత ఒడిస్సియస్‌.. చందమామపై దిగినట్లు హ్యూస్టన్‌లోని కంపెనీ కమాండ్‌ సెంటర్‌లో ఇంజినీర్లు ప్రకటించారు.
→ దీంతో అప్పటివరకూ కమాండ్‌ సెంటర్‌లో ఉత్కంఠగా గడిపిన ఇంజినీర్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
→ ల్యాండింగ్‌ సాఫీగా సాగిందని, వ్యోమనౌక నిటారుగా దిగిందని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ పేర్కొంది.
→ ఒడిస్సియస్‌ నుంచి తొలి చిత్రాలను డౌన్‌లింక్‌ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించింది.
→ ఒడిస్సియస్‌లో అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఈ సంస్థకు చెందిన ఆరు పరిశోధన పరికరాలు ఉన్నాయి.
→ అవి భవిష్యత్‌లో చంద్రుడిపైకి చేపట్టబోయే మానవసహిత యాత్రలకు బాటలు వేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
→ వీటికితోడు కొలంబియా స్పోర్ట్స్‌వేర్‌ సంస్థకు చెందిన ఇన్సులేటింగ్‌ జాకెట్‌ వస్త్రం, జెఫ్‌ కూన్స్‌ అనే శిల్పి చెక్కిన 125 మినీ చందమామలు కూడా వ్యోమనౌకలో ఉన్నాయి.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి