పార్కింగ్ కష్టాలకు ‘స్మార్ట్’ విరుగుడు!
→ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు ఓ స్మార్ట్ పార్కింగ్ పరికరాన్ని రూపొందించారు.→ నగరంలో వేగంగా వాహనం పార్కింగ్‌కు వీలుకల్పించడం సహా తొందరగా తీసుకెళ్లేందుకు ఇది ఉపయోగపడనుంది. దీని రూపకల్పన కోసం మున్సిపల్ అధికారులు ఓ అంకుర సంస్థ సాయం తీసుకున్నారు.
→ ఈ స్మార్ట్ పార్కింగ్ పరికరం సెన్సర్ల సాయంతో పనిచేస్తుంది. ప్రయోగాత్మకంగా అహ్మదాబాద్ నగరంలోని సింగూభవన్ రోడ్‌లో 5 సాధనాలను ఏర్పాటు చేశారు.
→ ఇలాంటి పరికరం దేశంలో ఎక్కడా లేదని మున్సిపల్ అధికారులు తెలిపారు. ‘‘ఈ సాధనం ఒక ఫ్లాప్ వంటి నిర్మాణం కలిగి వాహనాన్ని అడ్డుకునేలా ఉంటుంది. ఆన్ స్ట్రీట్ పార్కింగ్ (రోడ్డు పక్కన నిలపడం) కోసం ఇది ఉపయోగపడుతుంది.
→ ఏదైనా వాహనం ఈ పరికరం వద్దకు వచ్చినప్పుడు దాని ఫ్లాప్ పైకి లేచి అడ్డుగా ఏర్పడుతుంది. ఎంతసేపైనా వాహనం అక్కడ నిలపవచ్చు.
→ చెల్లింపుల తర్వాత ఫ్లాప్ కిందకు రాగానే డ్రైవర్లు తమ వాహనాన్ని తీసుకెళ్లవచ్చు’’ అని అహ్మదాబాద్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ రమ్య భట్ తెలిపారు.
→ రద్దీ సమయాల్లో నగరంలో వాహనాన్ని పార్కింగ్ చేయాలంటే కష్టపడాల్సి వస్తోందని స్మార్ట్ పార్కింగ్ సృష్టికర్త హార్దిక్ చెప్పారు. వాహనం ఎప్పుడు వచ్చింది.. ఎంతసేపు ఉంటుందనే విషయాలను చెప్పి రశీదు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
→ ఈ పరికరం వెంటనే వాహనాన్ని పార్క్ చేయటానికి వీలు కల్పించడం, త్వరగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.
→ వాహనం పార్క్‌చేసిన పరికరంపై క్యూఆర్ కోడ్ ఉంటుందని హార్దిక్ తెలిపారు.
→ స్కాన్ చేస్తే కారు ఏ పార్కింగ్ స్లాట్‌లో ఉంది.. ఏ జోన్.., దాని అడ్రస్.. ఎప్పుడు పార్క్ చేశారనే విషయాలన్నీ తెలుస్తాయని వివరించారు.
→ పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావటం వల్ల త్వరలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
→