ఏటా 15 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు
→ ఏటా 15 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు చేపట్టేందుకు వీలుగా తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో నిర్మించిన పీఎస్‌ఎల్‌వీ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ (పీఐఎఫ్) ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.→ ఇస్రో శాస్త్రవేత్తలు కొత్తగా ప్రయోగ వేదిక నిర్మించకుండా అందుబాటులో ఉన్న మొదటి ప్రయోగ వేదికను పీఐఎఫ్‌గా ఆధునికీకరించేందుకు 2018లో నిర్ణయించారు. రూ.471 కోట్లతో పనులు ప్రారంభించి పూర్తి చేశారు.
→ ఇప్పటి వరకు రాకెట్‌ను ప్రయోగ వేదికపైనే అనుసంధానం చేసేవారు. పీఐఎఫ్ అందుబాటులోకి రావడంతో ఇక నుంచి ఇందులోనే వాహకనౌక అనుసంధానం చేసి పూర్తి సాంకేతిక పరీక్షలు నిర్వహించాక ప్రయోగ వేదికకు తరలిస్తారు.
→
→