Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






స్వయం సమృద్ధికి తార్కాణం

→ గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన మెజార్టీ భాగాలను భారత్‌లోనే తయారుచేయడం.. అంతరిక్ష రంగంలో దేశ స్వయంసమృద్ధికి నిదర్శనమని మోదీ తెలిపారు.
→ ‘‘శిక్షణ సమయంలో వ్యోమగాములు ఎంతో అంకితభావం ప్రదర్శించారు. యోగానూ అభ్యసించారు.
→ సవాళ్లను అధిగమించే సత్తా, తిరుగులేని నిబద్ధతకు నిదర్శనమైన భారతీయ ‘అమృత్‌ తరానికి’ వీరు ప్రతినిధులు.
→ అంతరిక్ష రంగంలో మన విజయాలు.. యువతలో శాస్త్రీయ జిజ్ఞాసను పెంచుతున్నాయి.
→ 21వ శతాబ్దంలో అంతర్జాతీయ శక్తిగా ఎదిగేందుకు మన దేశానికి ఊతమిస్తున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
→ ‘‘చందమామ నుంచి నమూనాలను తెచ్చేందుకు మళ్లీ వ్యోమనౌకను పంపుతాం. 2035 నాటికి రోదసిలో మన అంతరిక్ష కేంద్రం సిద్ధమవుతుంది.
→ చందమామపైకి మన రాకెట్‌లో వ్యోమగామిని పంపుతాం’’ అని తెలిపారు.
→ ఈ రంగంలో భారత నారీశక్తి కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. మహిళా శాస్త్రవేత్తలు లేకుండా చంద్రయాన్, గగన్‌యాన్‌ వంటి మిషన్‌లను ఊహించుకోలేమని తెలిపారు.
→ అంతకుముందు ప్రధాని.. తిరువనంతపురం నుంచి అంతరిక్ష రంగానికి సంబంధించిన రూ.1,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేశారు.
→ అందులో శ్రీహరికోటలోని పీఎస్‌ఎల్‌వీ అనుసంధాన కేంద్రం, తమిళనాడులోని మహేంద్రగిరిలో సెమీ క్రయోజెనిక్స్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంజిన్‌ అండ్‌ స్టేజ్‌ టెస్ట్‌ ఫెసిలిటీ, తిరువనంతపురంలోని విక్రమ్‌సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రంలో ట్రైసోనిక్‌ విండ్‌ టన్నెల్‌ ఉన్నాయి.
→ ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి