Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






అంతరిక్షంలోకి భారత దూతలు

→ భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్‌యాన్‌’ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
→ వైమానిక దళానికి చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్, అంగద్‌ ప్రతాప్, అజిత్‌ కృష్ణన్, వింగ్‌ కమాండర్‌ శుభాన్షు శుక్లా.. రోదసిలోకి వెళ్లనున్నారు.
→ భారత భూభాగం నుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్ష యాత్ర చేయనున్న భారతీయ బృందంగా వీరు చరిత్ర సృష్టించబోతున్నారు.
→ తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ అంతరిక్ష కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నలుగురు వ్యోమగాములను పరిచయం చేశారు.
→ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు. వారికి ‘ఆస్ట్రోనాట్‌ వింగ్స్‌’ అమర్చారు.
→ ఈ వ్యోమగాములు నలుగురు వ్యక్తులు కారని.. 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను రోదసిలోకి మోసుకెళ్లే ‘నాలుగు శక్తులు’ అని కొనియాడారు.
→ నాలుగు దశాబ్దాల తర్వాత భారతీయుడు అంతరిక్షంలోకి పయనమవుతున్నాడని తెలిపారు.
→ ‘‘ఈసారి కౌంట్‌డౌన్‌ మనదే.. టైమింగ్‌ మనదే.. రాకెట్‌ మనదే’ అని ఆయన వ్యాఖ్యానించారు.
→ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రాకేశ్‌ శర్మ 1984లో రికార్డు సృష్టించారు.
→ అయితే ఆయన రష్యా ప్రయోగకేంద్రం నుంచి వెళ్లిన వ్యోమనౌకలో ఈ ఘనత సాధించారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి