Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






5 నిమిషాల్లోనే బయాప్సీ ఫలితాలు

→ బయాప్సీ ఫలితాల కోసం రోజుల తరబడి వేచి చూసే పరిస్థితికి తెరపడింది.
→ ఇక నుంచి ఐదు నిమిషాల్లోనే ఈ ఫలితాలు తెలుసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
→ ప్రస్తుతం అమెరికా, జర్మనీలలో వినియోగిస్తున్న సాంకేతికతన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ప్రవేశపెట్టింది.
→ వివాస్కోప్‌ అనే విప్లవాత్మక ఇన్‌స్టెంట్‌ డిజిటల్‌ పాథాలజీ సాంకేతికతను ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో మొదటిసారి తీసుకొచ్చింది.
→ ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, డైరెక్టర్‌ డాక్టర్‌ జీవీ రావు, పాథాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.
→ ‘‘ఇప్పటిదాకా సంప్రదాయ పద్ధతిలో కణజాల నమూనాలను సేకరించాక బయాప్సీ ఫలితాల కోసం ఐదు రోజుల వరకు నిరీక్షించాల్సి వచ్చేది.
→ వివాస్కోప్‌ సాంకేతికతతో ఆ సమయం ఐదు నిమిషాలకు తగ్గింది. తద్వారా వేగంగా రోగ నిర్ధారణ చేసి చికిత్స ప్రణాళిక అమలు చేయడం వల్ల రోగికి మెరుగైన ఫలితాలను అందించవచ్చు.
→ ముఖ్యంగా జీఐ క్యాన్సర్లకు సంబంధించి సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఈ సాంకేతికత చాలా కీలకం’’ అని డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి వివరించారు.
→ ఇతర అవయవాల నుంచి సేకరించిన కణజాల నమూనాలను సైతం ఐదు నిమిషాల్లో పరీక్షించేందుకు వివాస్కోప్‌ను వినియోగించవచ్చునని చెప్పారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి