Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home







‘ఆమ్కా’ అభివృద్ధికి సీసీఎస్‌ఆమోదముద్ర

→ వైమానిక దళ భవిష్యత్‌అవసరాలకు అనుగుణంగా భారత్‌త్వరలోనే అయిదో తరం స్టెల్త్‌యుద్ధవిమానాలను తయారు చేయనుంది
→ ఈ మేరకు దేశీయంగా ‘అడ్వాన్స్‌డ్‌మీడియం కంబాట్‌ఎయిర్‌క్రాఫ్ట్‌(ఆమ్కా)’ రూపకల్పన, అభివృద్ధిపై దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రతిపాదనకు భద్రతా వ్యవహారాల కేబినెట్‌కమిటీ (సీసీఎస్‌) ఆమోదముద్ర వేసింది.
→ ఈ ప్రాజెక్టు ప్రాథమిక అభివృద్ధి వ్యయం రూ.15 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
→ ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం- ప్రైవేటు పరిశ్రమల సాయంతో ఏరోనాటికల్‌డెవలప్‌మెంట్‌ఏజెన్సీ (ఏడీఏ), హిందుస్థాన్‌ఏరోనాటిక్స్‌లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) 5 ఆమ్కా నమూనాలను తయారుచేస్తాయి.
→ ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా వంటి కొన్ని దేశాల వద్దే అయిదోతరం స్టెల్త్‌యుద్ధవిమానాలు ఉన్నాయి.
→ మరోవైపు- తీరరక్షక దళం, సైన్యం కోసం 34 ధ్రువ్‌అడ్వాన్స్‌డ్‌లైట్‌హెలికాప్టర్లను సమకూర్చుకునేందుకూ సీసీఎస్‌సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి