Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home


తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్‌13బి’





→సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు.
→ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు.
→పురుషుల్లో సంతానలేమిపై ఈ సంస్థ తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలను గుర్తించారు.
→పురుషుల్లో వీర్య కణ అభివృద్ధికి ఎక్స్‌ క్రోమోజోమ్‌ జన్యువు(టీఈఎక్స్‌13బి) అవసరమని మొదటిసారిగా సీసీఎంబీ పరిశోధకులు గుర్తించారు.
→తల్లి నుంచే ఇది సంక్రమిస్తుందని పేర్కొన్నారు. వేర్వేరు సంస్థలతో కలిసి సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్, డాక్టర్‌ పి.చంద్రశేఖర్, డాక్టర్‌ స్వస్తిరాయ్‌ చౌధురి చేసిన పరిశోధన వివరాలు తాజాగా ‘హ్యూమన్‌ రీప్రొడక్షన్‌ జర్నల్‌’లో ప్రచురితమయ్యాయి.
→శాస్త్రవేత్తల బృందం నెక్స్ట్‌ జనరేషన్‌ సీక్వెన్సింగ్‌ ఉపయోగించి సంతానం ఉన్న, సంతానలేమితో బాధపడుతున్న పురుషుల జన్యు కోడింగ్‌ రీజియన్లను విశ్లేషించింది.
→టీఈఎక్స్‌13బి జన్యువులోని రెండు కారణ ఉత్పరివర్తనాలను కనుగొని ఈ మేరకు ఫలితాలు రాబట్టినట్లు పీహెచ్‌డీ విద్యార్థి, యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌ పోస్ట్‌డాక్టొరల్‌ రీసెర్చర్‌ డాక్టర్‌ ఉమేశ్‌కుమార్‌ తెలిపారు.
→పరిశోధకులు ఎలుకల్లో స్పెర్మ్‌ ఉత్పత్తి కణాల సెల్‌ కల్చర్‌ మోడల్‌ను అభివృద్ధి చేశారు. క్రిస్పర్‌ కాస్‌9 సాంకేతికత ఉపయోగించి టీఈఎక్స్‌13బి జన్యువును తొలగించి చూశారు.
→అప్పుడు స్పెర్మ్‌ కణాల ఉత్పత్తి సామర్థ్యం తగ్గినట్లు గుర్తించారు.
→స్పెర్మ్‌ ఉత్పత్తి కణాల్లో జీవక్రియను టీఈఎక్స్‌13బి ప్రభావితం చేస్తుందని నిర్ధారణకు వచ్చారు.
→స్పెర్మాటోజెనిక్‌ కారణంగా సంతానలేమితో బాధపడుతున్న మగవారిని పరీక్షించడానికి ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడతాయని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ నందికూరి తెలిపారు.
→‘టీఈఎక్స్‌13బి జన్యువు ఎక్స్‌ క్రోమోజోమ్‌లో ఉంటుంది.
→తల్లుల నుంచి మగవారు దీన్ని పొందుతారు. ఒకవేళ తల్లి లోపభూయిష్ట ‘టీఈఎక్స్‌13బి’ని కలిగి ఉంటే అది వారి మగ సంతానానికి సంక్రమిస్తుంది.
→ఆమె తనయుడు వంధ్యత్వానికి గురవుతాడు’ అని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్‌ తంగరాజ్‌ అన్నారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి