Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






సజాతీయ రేణువుల మధ్య పరస్పర ఆకర్షణ: ఆక్స్‌ఫర్డ్‌

→ సజాతీయ రేణువులు పరస్పరం వికర్షించుకుంటాయన్నది భౌతిక శాస్త్రంలో ప్రాథమిక సూత్రం.
→ అయితే, అవి కూడా ఆకర్షించుకుంటున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. దీంతో దీర్ఘకాలంగా వ్యాప్తిలో ఉన్న సూత్రీకరణతో ఇది విభేదించినట్లయింది.
→ ద్రావణ మాధ్యమంలో ఉన్న సజాతీయ రేణువులు పరస్పరం ఆకర్షించుకునే అవకాశం ఉందని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
→ ద్రావణంలోని పీహెచ్‌ (ఆమ్లత్వం లేదా క్షారత్వాన్ని సూచించే కొలమానం), సంబంధిత బలం తీరు (ఆకర్షణ లేదా వికర్షణ) రుణావేశ, ధనావేశ రేణువులకు భిన్నంగా ఉంటాయని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు.
→ నీటిలో ఉన్నప్పుడు రుణావేశ రేణువులు సమూహంలా ఏర్పడతాయని, ఆల్కహాల్‌లో మాత్రం ధనావేశ రేణువులు జట్టు కడతాయని తేల్చారు.
→ ఔషధాలు, జీవరసాయన శాస్త్ర రంగాల్లో భిన్న రేణువులతో ముడిపడిన అనేక ప్రక్రియలపై తాజా పరిశోధన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి