తొలి చిత్రాలను పంపిన ఇన్‌శాట్-3డీఎస్
→ ఇస్రో ప్రయోగించిన వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీఎస్.. భూ చిత్రీకరణను ప్రారంభించింది.→ అందులోని 6-ఛానల్ ఇమేజర్, 19-ఛానల్ సౌండర్ ఒడిసిపట్టిన చిత్రాలను సంస్థ తాజాగా విడుదల చేసింది.
→ ఈ సాధనాలను అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎస్‌ఏసీ) అభివృద్ధి చేసింది.
→ ఈ చిత్రాలను కర్ణాటకలోని హసన్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ప్రాసెస్ చేసింది.
→ 6-ఛానల్ ఇమేజర్.. భూ ఉపరితలాన్ని, వాతావరణాన్ని బహుళ తరంగదైర్ఘ్యాల్లో చిత్రీకరించగలదు.
→ దాని సాయంతో మేఘాలు, గాల్లోని ఏరోసాల్ రేణువులు, భూ ఉపరితల ఉష్ణోగ్రత, పచ్చదనం, నీటి ఆవిరి తీరు వంటి వివరాలను తెలుసుకోవచ్చు.
→ 19-ఛానల్ సౌండర్ సాయంతో.. భూ వాతావరణం నుంచి వెలువడే రేడియోధార్మికతను పరిశీలించొచ్చు.
→