Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home





మిషన్‌ దివ్యాస్త్ర లో మహిళామణులు

→ హైదరాబాద్‌ మిసైల్‌ కాంప్లెక్స్‌లో ఎంఐఆర్‌వీ పరిజ్ఞానం అభివృద్ధి రక్షణ రంగంలో భారత్‌ చేపట్టిన ‘మిషన్‌ దివ్యాస్త్ర విజయవంతమైంది.
→ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో ‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌ (ఎంఐఆర్‌వీ) పరిజ్ఞానాన్ని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
→ హైదరాబాద్‌ మిసైల్‌ కాంప్లెక్స్‌లోని డీఆర్‌డీవో-ఏఎస్‌ఎల్‌ శాస్త్రవేత్త షీనా రాణి ప్రాజెక్టును ముందుండి నడిపించారు.
→ ఇందులోని కీలక సభ్యులంతా మహిళలే కావడం విశేషం. పీడీ శంకరీ, ఉషావర్మ, విజయలక్ష్మి, సుఖ్‌వాణి, నీరజ, వెంకటమణి ముఖ్య పాత్ర పోషించారు.
→ హైదరాబాద్‌లోని ఏఎస్‌ఎల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ షీనా రాణి ఈ ప్రోగ్రాం డైరెక్టర్‌గా ఉన్నారు.
→ ఆమె ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రురాలు. ఎనిమిదేళ్లు విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో పనిచేశారు.
→ 1999లో డీఆర్‌డీవోలో చేరారు. అగ్ని క్షిపణులకు సంబంధించి అన్ని శ్రేణుల లాంచ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌పై పనిచేస్తున్నారు.
→ వీరి బృందం మూడేళ్లుగా పనిచేస్తోంది.


మిషన్‌ దివ్యాస్త్ర విజయవంతం

→ రక్షణ రంగంలో భారత్‌ మరో అరుదైన ఘనతను సాధించింది. బహుళ వార్‌హెడ్లను మోసుకెళ్లే అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది.
→ శత్రువుకు సంబంధించిన విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో విరుచుకుపడటానికి ఇది వీలు కల్పిస్తుంది.
→ ‘మిషన్‌ దివ్యాస్త్ర’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ‘మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌’ (ఎంఐఆర్‌వీ) పరిజ్ఞానాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు తొలిసారిగా పరీక్షించారు.
→ దీంతో ఈ తరహా సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌ దేశాల సరసన భారత్‌ నిలిచింది.
→ ఈ ప్రయోగం గురించి ప్రకటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. శాస్త్రవేత్తల కృషిని అభినందించారు.
→ ఇది చాలా ముఖ్యమైన మైలురాయి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా శాస్త్రవేత్తలను అభినందించారు.
→ ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి ఈ క్షిపణి పరీక్ష జరిగింది. ప్రయోగానికి సంబంధించిన అన్ని లక్ష్యాలూ నెరవేరినట్లు రక్షణశాఖ ప్రకటించింది.
→ బహుళ రీఎంట్రీ వెహికల్స్‌ను వివిధ టెలిమెట్రీ, రాడార్‌ కేంద్రాలు నిశితంగా పరిశీలించాయని తెలిపింది.
→ ‘మిషన్‌ దివ్యాస్త్ర’కు ఒక మహిళా శాస్త్రవేత్త నేతృత్వం వహించారు.

→ ఏమిటీ క్షిపణి?
→ స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించిన క్షిపణుల్లో ‘అగ్ని-5’ అత్యంత శక్తిమంతమైంది.
→ 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు.
→ ఈ ఖండాంతర క్షిపణి.. అణ్వస్త్రాన్నీ మోసుకెళ్లగలదు. ప్రధానంగా చైనా నుంచి ఎదురయ్యే ముప్పులను తిప్పికొట్టడానికి దీన్ని రూపొందించారు.
→ ఆ దేశం మొత్తం దీని పరిధిలోకి వస్తుంది. అగ్ని-1 నుంచి అగ్ని-4 రకం క్షిపణులు 700-3,500 కి.మీ. మధ్య దూరాన్ని చేరుకోగలవు.
→ అవి 1990ల నుంచి భారత సైనిక దళాల్లో సేవలు అందిస్తున్నాయి.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి