Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






జపాన్‌ చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం విఫలం

→ జపాన్‌ చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగం మధ్య జపాన్‌లోని వకయామా పర్వత ప్రాంతంలో కూలిపోయింది.
→ టోక్యోకు చెందిన స్పేస్‌ వన్‌ సంస్థ నిర్మించిన కైరోస్‌ అనే రాకెట్‌ ప్రభుత్వ ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి ఎగసింది.
→ ఆ వెంటనే కొద్ది క్షణాల్లోనే పేలుడుకు గురై అగ్నిగోళంలా మారింది. దీని శకలాలు పడిన వెంటనే అక్కడున్న నీటి స్ప్రింక్లర్లు పని చేయడంతో ప్రమాదం జరగలేదు.
→ ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఆ దేశంలో శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు సంస్థగా ఇది రికార్డు సృష్టించేది.
→ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావించిన జపాన్‌.. తాజా వైఫల్యంతో కొంత నిరాశ చెందింది.
→ ప్రస్తుతం కక్ష్యలో ఉన్న నిఘా ఉపగ్రహాల్లో సమస్యలు తలెత్తితే వెంటనే మరో దానిని నింగిలోకి పంపే ప్రక్రియను ఈ ప్రయోగంలో విశ్లేషించాలనుకుంది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి