ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
→ తాజాగా కృత్రిమ మేధతో రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(ఏఐ చాట్‌బాట్) కూడా వచ్చేసింది.→ అమెరికాకు చెందిన టెక్ కంపెనీ కాగ్నిషన్ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ‘డెవిన్’ను రూపొందించింది.
→ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.
→ ‘డెవిన్’ ప్రముఖ ఏఐ కంపెనీలు నిర్వహించిన ప్రాక్టికల్ ఇంజినీరింగ్ ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసిందని ఆ సంస్థ తెలిపింది.
→ ‘‘ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు అలవోకగా కోడ్ రాసేస్తుంది. వెబ్‌సైట్లను క్రియేట్ చేస్తుంది. సాఫ్ట్‌వేర్‌ను సృష్టిస్తుంది’’ అని డెవిన్ గురించి కంపెనీ పేర్కొంది.
→ కష్టతరమైన ఇంజినీరింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలను అమలుచేయగల సామర్థ్యం ‘డెవిన్’కు ఉందని వెల్లడించింది.
→