Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






అమెరికాకు స్పేస్‌ఎక్స్‌ నిఘా శాటిలైట్‌

→ ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ఎక్స్‌’ ప్రపంచం కనీవినీ ఎరుగని స్థాయిలో అమెరికాకు నిఘా శాటిలైట్‌ నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది.
→ వందలాది ఉపగ్రహాలతో అమెరికా ఈ నిఘా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తోంది.
→ ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చే పనిని స్పేస్‌ఎక్స్‌ చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
→ ఈ మేరకు స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షీల్డ్‌ విభాగం అమెరికా నిఘా ఉపగ్రహాల కార్యకలాపాలను పర్యవేక్షించే ఎన్‌ఆర్‌వో సంస్థతో 2021లో ఒప్పందం చేసుకుంది.
→ దీని విలువ 1.8 బిలియన్‌ డాలర్లు (రూ.14,920 కోట్లు). ఈ కొత్త ప్రాజెక్టులోని శాటిలైట్లు పదాతి దళానికి సహకరించనున్నాయి.
→ ప్రాజెక్టు విజయవంతమైతే అమెరికా ఇంటెలిజెన్స్‌ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.
→ ప్రపంచంలో ఏ మూలనైనా తన లక్ష్యాలను వేగంగా గుర్తించే అవకాశం లభిస్తుంది. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది.
→ 2020లో దాదాపు డజనుకు పైగా ప్రొటోటైప్‌ ఉపగ్రహాలను ‘స్పేస్‌ఎక్స్‌’ ఫాల్కన్‌ 9 రాకెట్‌ సాయంతో కక్ష్యలోకి చేర్చింది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి