అంతుచిక్కని కృష్ణ పదార్థం వెలుగులోకి తెచ్చిన శాస్త్రవేత్తలు
→ విశ్వంలో పదార్థం- కృష్ణపదార్థం మధ్య నెలకొన్న అసమతౌల్యాన్ని వివరించేందుకు ఒక వినూత్న సిద్ధాంతాన్ని గువాహటి ఐఐటీ శాస్త్రవేత్తలు, అంతర్జాతీయ పరిశోధకులు ప్రతిపాదించారు.→ అంతుచిక్కని కృష్ణ పదార్థ తీరునూ ఇది వెలుగులోకి తెచ్చింది. విశ్వంలో కంటికి కనిపించే పదార్థం వాటా 5 శాతమే.
→ నక్షత్రాలు, గెలాక్సీల రూపంలో అది ఉంటుంది. మిగతాదంతా అదృశ్య కృష్ణపదార్థమే. అది కాంతిని వెలువరించదు.
→ కృష్ణపదార్థ మూలాలు మిస్టరీగా ఉన్నాయి. దృశ్యపదార్థంలో బేర్యాన్లు (పదార్థం), తక్కువ పరిమాణంలో యాంటీ బేర్యాన్లు (వ్యతిరేక పదార్థం) ఉంటాయి.
→ మొదట్లో ఈ రెండూ సమానంగా ఉండేవని అంచనా. ఒకవేళ ఆరంభంలో ఏమైనా అసమతౌల్యం ఉంటే అది.. విశ్వం వేగంగా విస్తరించే దశ (ఇన్‌ఫ్లేషన్)లో సవరణకు నోచుకొని ఉండేది.
→ ‘‘అయితే నేడు పదార్థం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితిని బేర్యాన్ అసిమెట్రీ ఇన్ ద యూనివర్స్- బీఏయూగా పిలుస్తారు. ఇది శాస్త్రవేత్తల అంచనాలకు భిన్నం. అది నేటికీ అపరిష్కృతంగా ఉంది. తొలి నాటి విశ్వంపై మనకున్న అవగాహనను ఇది సవాల్ చేస్తోంది’’ అని ఐఐటీ గువాహటి పరిశోధకుడు దేబాశీస్ బోరా తెలిపారు. విశ్వంలోని కృష్ణ పదార్థం, బీఏయూకు సంబంధించిన చిక్కుముడిని పదార్థ భౌతిక శాస్త్రంలోని ‘ప్రామాణిక నమూనా’తో పరిష్కరించలేమని ఆయన వివరించారు. దీనిపై తాము ఒక సూత్రీకరణ చేసినట్లు చెప్పారు. దీని ప్రకారం.. కృష్ణపదార్థ క్షీణత వల్లే బేర్యాన్ అసమతౌల్యం ఉత్పన్నమైందన్నారు. అవి రెండూ ఒకేసారి పుట్టుకొచ్చినట్లు వివరించారు.
→