కాంతి వేగంతో ఎలక్ట్రాన్‌ల శక్తి మార్పిడి
→ హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్) శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్‌లను లేజర్ ఆధారిత సూక్ష్మ పద్ధతిలో మెగా ఎలక్ట్రాన్ ఓల్ట్‌గా మార్చే విధానాన్ని కనుగొన్నారు.→ దీని ద్వారా ఒక ఎలక్ట్రాన్ శక్తితో చేసే పనిని మెగాఎలక్ట్రాన్ ఓల్ట్ అందులో వందో వంతు శక్తితోనే పూర్తిచేయనుంది.
→ సాధారణంగా వివిధ క్యాన్సర్‌లను నయం చేసేందుకు బాధితుల శరీరంలో క్యాన్సర్ కణాలను లేజర్ ద్వారా గుర్తించి వైద్యులు కీమోథెరపీ చికిత్స అందిస్తున్నారు.
→ టీఐఎఫ్‌ఆర్ శాస్త్రవేత్తలు కనుగొన్న లేజర్ ఆధారిత విధానం ద్వారా కీమోథెరపీ చికిత్సలో వేలరెట్లకు పైగా వేగంగా మెగాఎలక్ట్రాన్ వోల్ట్ శక్తిగా మారి బాధితుల శరీర భాగాల్లో అత్యంత సూక్ష్మమైన క్యాన్సర్ కణాలనూ నాశనం చేయనుంది.
→ క్యాన్సర్ చికిత్సలే కాకుండా.. మెదడు, ఇతర శరీర భాగాల్లో కణితులను సూక్ష్మ పద్ధతుల్లో నిర్వీర్యం చేసేందుకు వీలుంటుంది.
→ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, ఇతర జనసమ్మర్ద ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న వారు తీసుకువస్తున్న సంచులు, సూట్‌కేస్‌లను వేగంగా స్కాన్ చేయవచ్చు.
→ విమానాల్లో ప్రొపెల్లర్ తిరుగుతున్నప్పుడు అప్పుడప్పుడూ తలెత్తే సూక్ష్మలోపాలు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేప్పుడు నిర్మాణ దశలో ఉండగానే.. పిల్లర్లు, స్లాబుల్లో లోపాలను ఈ విధానం ద్వారా గుర్తించేందుకు వీలుంది.
→