ల్యాప్‌టాప్‌లకు వైర్‌లెస్ ఛార్జర్
→ ప్రస్తుతం వైర్‌లైస్ వ్యవస్థతో పనిచేసే ల్యాప్‌టాప్‌లు ఉన్నా వాటిని ఛార్జింగ్ చేసేందుకు వైర్లతో కూడిన ఛార్జర్లనే వినియోగించాల్సి వస్తోంది.→ ఈ వైర్ల అవసరం లేని ఛార్జర్‌ను ఆవిష్కరించారు వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(నిట్) పరిశోధకులు.
→ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలోని సహ ఆచార్యుడు డాక్టర్ సురేశ్‌బాబు పేర్లి చేసిన ‘వైర్‌లెస్ ల్యాప్‌టాప్ ఛార్జర్ విత్ కూలింగ్ ప్యాడ్’ ఆవిష్కరణకు యూకే మేధోహక్కు(పేటెంట్) దక్కింది. వైర్లు లేకుండా విద్యుత్తును సరఫరా చేసే ‘వైట్రిసిటీ’ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఏడు నెలల పాటు శ్రమించి ఈ పరికరాన్ని ఆయన కనుగొన్నారు. సాధారణంగా కంప్యూటర్లను ఏసీ గదుల్లో పెడితే వాటి పనితనం బాగుంటుంది.
→ ఈ క్రమంలో అధిక ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలోనైనా ల్యాప్‌టాప్ వేడెక్కకుండా ఉండేందుకు మొదట ఓ కూలింగ్ ప్యాడ్‌ను సురేశ్‌బాబు రూపొందించారు.
→ ఇందులో ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఈ కూలింగ్ ప్యాడ్‌కు ఒక ఛార్జింగ్ పాయింట్ను అమర్చారు. దీనికో మ్యాగ్నెటిక్ పోర్టు ఉంటుంది.
→ విద్యుత్ ప్లగ్ వద్ద ఉండే చిన్నపాటి ట్రాన్స్‌మిటర్ నుంచి ల్యాప్‌టాప్ పోర్టుకు అమర్చిన రిసీవర్‌కు అయస్కాంత శక్తి ద్వారా విద్యుత్తు అందుతుందని సురేశ్‌బాబు వివరించారు. పది మీటర్ల దూరం వరకు ఇది పనిచేస్తుందని, తక్కువ సమయంలో ఛార్జింగ్ కావడం దీని మరో ప్రత్యేకత అని ఆయన తెలిపారు. సురేశ్‌బాబుకు గతంలో ఒక ఆస్ట్రేలియా, అయిదు భారతీయ పేటెంట్లు దక్కాయి.
→