Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






ఆఖరి క్షణాల్లో ఆగిన వ్యోమగాముల ప్రయాణం

→ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) ముగ్గురు వ్యోమగాములను పంపించేందుకు తలపెట్టిన ప్రయోగాన్ని రష్యా చివరి క్షణాల్లో నిలిపివేసింది.
→ కజఖ్‌స్థాన్‌లోని బైకనూర్‌ నుంచి రష్యాకు చెందిన సోయజ్‌ రాకెట్‌లో ట్రాసీ డైసన్‌ (నాసా), ఒలెగ్‌ నొవిట్‌స్కీ (రాస్‌కాస్మోస్‌), మెరీనా వాసిలెవ్‌స్కయా (బెలారస్‌) బయలుదేరాల్సి ఉంది.
→ అయితే రాకెట్‌ నింగిలోకి ఎగరడానికి దాదాపు 20 సెకన్ల ముందు అనూహ్యంగా ప్రయోగాన్ని నిలిపివేశారు.
→ పవర్‌ సోర్స్‌లో ఓల్టేజీ తగ్గిపోవడమే అందుకు కారణమని రాస్‌కాస్మోస్‌ అంతరిక్ష సంస్థ అధినేత యూరీ బొరిసోవ్‌ తెలిపారు. తిరిగి ఈ ప్రయోగాన్ని చేపడతామని చెప్పారు.
→ 2018 అక్టోబరులో కూడా వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు చేర్చేందుకు రష్యా తలపెట్టిన ఓ ప్రయోగం చివరి నిమిషాల్లో నిలిచిపోయింది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి