Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






మనిషికి పంది మూత్రపిండం

→ జంతువుల అవయవాలను ఉపయోగించి మానవుల ప్రాణాలు రక్షించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా వైద్య నిపుణులు మరో కీలక ముందడుగు వేశారు.
→ జన్యు సవరణ విధానంలో అభివృద్ధి చేసిన పంది మూత్రపిండాన్ని 62 ఏళ్ల ఓ రోగికి అమర్చారు.
→ జీవించి ఉన్న వ్యక్తికి వరాహ కిడ్నీని అమర్చడం ఇదే తొలిసారి అని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
→ ఈ నెలలోనే సంబంధిత శస్త్రచికిత్స చేశామని, అవయవ గ్రహీత బాగానే కోలుకుంటున్నారని వెల్లడించారు.
→ త్వరలోనే డిశ్ఛార్జి చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గతంలో పంది మూత్రపిండాలను జీవన్మృతుల్లోకి తాత్కాలికంగా మార్పిడి చేసిన దాఖలాలు ఉన్నాయని పేర్కొన్నారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి