Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






ఇస్రో ‘పుష్పక’ ప్రయోగం విజయవంతం

→ అంతరిక్షంలో ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు, వాటిని మోసుకెళ్లే వాహకనౌకల పునరుద్ధరణ దిశగా భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) చేపడుతున్న ప్రయోగం మరోసారి విజయవంతమైంది.
→ అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకోవడమే లక్ష్యంగా పునర్వినియోగ వాహకనౌకల (రీయూజబుల్‌ లాంచ్‌ వెహికిల్‌ ల్యాండింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌- ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌) పనితీరును గతేడాది ఏప్రిల్‌లో పరిశీలించింది.
→ ఇదే వాహనాన్ని ఆధునికీకరించి రూపొందించిన ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్‌-02ను పరీక్షించారు.
→ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఏరోనాటికల్‌ టెస్ట్‌రేంజ్‌ (ఆర్‌టీఆర్‌)లో చేపట్టిన ల్యాండింగ్‌ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది.
→ ‘పుష్పక్‌’ పేరుతో పిలిచే ఈ రెక్కల వాహనాన్ని భారతీయ నౌకాదళానికి చెందిన చినూక్‌ హెలికాప్టర్‌ ద్వారా తీసుకెళ్లి రన్‌వేకి నాలుగు కిలోమీటర్ల దూరం, 4.5 కిలోమీటర్ల ఎత్తులో జారవిడిచారు.
→ అక్కడి నుంచి నిర్దేశిత మార్గంలో ఎలాంటి అవరోధాలు లేకుండా పుష్పక్‌ స్వతంత్రంగా రన్‌వేలో దిగింది.
→ ఇందులో అమర్చిన బ్రేక్‌ ప్యారాచూట్, ల్యాండింగ్‌ గేర్‌ బ్రేక్స్, నోస్‌ వీల్‌ స్టీరింగ్‌ వ్యవస్థలను సమర్థంగా వినియోగించుకుంటూ సురక్షితంగా కిందకు దిగినట్లు ఇస్రో వెల్లడించింది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి