Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






స్వీయ భౌతిక నిర్మాణంతో రంగుల హరివిల్లు!

→ వర్ణకాల (పిగ్మెంట్‌లు) అవసరం లేకుండా, స్వీయ భౌతిక నిర్మాణంతోనే ప్రకాశవంతమైన రంగులను ప్రదర్శించగల మృదువైన పటలాలను (ఫిల్మ్స్‌) బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు.
→ సాగదీసినప్పుడు చోటుచేసుకునే యాంత్రిక విరూపణం (మెకానికల్‌ డీఫార్మేషన్‌)కు ప్రతిస్పందనగా ఈ ఫిల్మ్‌లు ప్రదర్శించే రంగులు మారుతుంటాయని ఐఐఎస్‌సీ వెల్లడించింది.
→ గాలియం లోహాన్ని బాష్పీభవింపజేసి.. సంబంధిత నానో కణాలను ఒక మృదువైన పదార్థంపై పొందుపర్చడం ద్వారా ప్రస్తుత కొత్త తరహా ఫిల్మ్‌లను రూపొందించినట్లు తెలిపింది.
→ రత్నాలు, నెమలి ఈకలు సహజంగా రంగురంగుల్లో కనువిందు చేస్తుంటాయనివాటి నుంచి స్ఫూర్తి పొంది తాజా సాంకేతికతను అభివృద్ధి చేశామని వివరించింది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి