Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home


పెద్దలకు బీసీజీ టీకా





→క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లు పైబడినవారికి బీసీజీ టీకా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుడుతోంది.
→మొదటి దశలో రాష్ట్రంలో ఎంపిక చేసిన 17 జిల్లాల్లో గుర్తించిన సుమారు 60 లక్షల మందికి ఒక డోసు టీకా ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది.
→జులై చివరివారం లేదా ఆగస్టు మొదటివారంలో ఇది ప్రారంభం కానుంది. అప్పటి నుంచి మూడు నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
→ఇప్పటి వరకు పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్‌ ఇస్తుండగా 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లు పైబడినవారికి ఇవ్వనున్నారు.
→జాతీయ క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ దీన్ని నిర్దేశించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా ఇది అమలవుతోంది.
→ఇప్పటికే దేశంలో తొలివిడతగా ఎనిమిది రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ మొదలైంది. తాజాగా మలివిడతలో తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో అమలుకానుంది.
→రాష్ట్ర క్షయవ్యాధి నిర్మూలన విభాగం నోడల్‌ సంస్థగా దీన్ని నిర్వహిస్తోంది. టీబీ వచ్చే అవకాశం ఉందని గుర్తించిన వారికి మాత్రమే టీకా ఇవ్వనున్నారు.
→ఎవరెవరికి ఇవ్వాలని గుర్తించేందుకు ఆరు కేటగిరీలను నిర్దేశించుకున్నారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి