స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
→ హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది.→ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)లోని ప్రొపల్షన్ టెస్ట్‌బెడ్ వద్ద ఈ ప్రయోగం నిర్వహించినటు ఆ సంస్థ ప్రకటించింది.
→ 85 సెకన్ల పాటు నిర్వహించిన ఈ పరీక్షలో రాకెట్ ఇంజిన్ 186 కిలోన్యూటన్ల థ్రస్ట్‌ను విడుదల చేసినట్లు పేర్కొంది.
→ కలాం-250గా వ్యవహరించే ఈ ఇంజిన్.. రాకెట్‌ను భూ వాతావరణం నుంచి అంతరిక్షంలోకి పంపించడంలో కీలకంగా వ్యవహరించనుందని ప్రకటనలో వెల్లడించింది.
→